AP NMMS December-2025: Press Note on Certificate Verification
పత్రికా ప్రకటన
Rc.No: 03/E/2025, Dated: 12-01-2026
ది. 07-12-2025 న జరిగిన నేషనల్ మీన్స్-కం-మెరిట్ స్కాలర్షిప్ పరీక్షకు హాజరైన విద్యార్ధులు ది.20-01-2026 లోపు ఖచ్చితంగా వారి కుల, ఆదాయ మరియు 7 వ తరగతి మార్కుల శాతం యొక్క ధృవీకరణ పత్రములు సిద్ధం చేసుకొనవలెను. పత్రములు ధృవీకరణ కొరకు త్వరలో పత్రికా ప్రకటనను విడుదల చేసి కార్యాలయపు వెబ్సైటు www.bse.ap.gov.in నందు ఉంచడం జరుగును. విద్యార్ధులు, తల్లి తండ్రులు మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెబ్సైటు www.bse.ap.gov.in ను గమనించుకొనవలెను.
ఈ పరీక్ష ఫలితాల ప్రక్రియలో భాగంగా త్వరలో విద్యార్ధుల యొక్క పత్రముల పరిశీలనార్ధం లిస్ట్ సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంనకు పంపబడుతుంది. ఆ సమయమునకు వారు అడిగిన వెంటనే హాల్ టికెట్ జిరాక్స్ కాపీతో సహా అన్ని పత్రములను వారి కార్యాలయంలో అందజేయవలెను. జిల్లా విద్యా శాఖాధికారి వారు తెలిపిన తేదీలోపు సర్టిఫికేట్ నకళ్లను అందజేయని విద్యార్ధుల యొక్క వివరములు తుది జాబితా నుండి తొలగింపబడును. దీనికి తల్లి తండ్రులే బాధ్యత వహించవలెను. SC విద్యార్థులకు గ్రూప్-1 లేదా గ్రూప్-2 లేదా గ్రూప్-3 కు సంబంధించిన సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండవలెను. ఈ పరీక్ష జాతీయ విద్యా మంత్రిత్వ శాఖ, న్యూ ఢిల్లీ వారి ద్వారా నడుపబడుతుంది.
స్కీమ్ కు సంబంధించిన అన్ని వివరములు జాతీయ విద్యా మంత్రిత్వ శాఖ, కొత్త ఢిల్లీ వారి వెబ్సైటు www.scholarships.gov.in లేదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరీక్షల కార్యాలయపు వెబ్సైటు www.bse.ap.gov.in లో అందుబాటులో ఉండును. తుది జాబితా విడుదల చేసిన తరువాత ఎట్టి పరిస్థితులలోనూ ఎటువంటి అభ్యర్ధనలు (స్పందన, కోర్టు వ్యాజ్యములు, లోకాయుక్త వ్యాజ్యములు) అంగీకరించబడవు. విద్యార్ధి తల్లి తండ్రులు ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని గడువు తేదీకు ముందుగానే సర్టిఫికేట్ లను సిద్ధం చేసుకుని సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయుల ద్వారా జిల్లా విద్యాశాఖాధికారి వారి కార్యాలమునకు అందజేయబడులాగున ఏర్పాటు చేసుకొనవలసినదిగా ప్రభుత్వ పరీక్షల సంచాలకులు డా|| కె. వి. శ్రీనివాసులు రెడ్డి గారు తెలియజేశారు.
Thank you for reading... Share this...
