AP Model schools APMS Inter Admission Notification 2025-26
ఆంధ్రప్రదేశ్ ఆదర్శ పాఠశాలలలో 2025-26 విద్యా సంవత్సరములో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశము కొరకు ప్రకటన
ఆంధ్రప్రదేశ్ లోని 163 మోడల్ స్కూల్స్ (ఆదర్శ పాఠశాల) లో 2025-26 విద్యా సంవత్సరమునకు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో విద్యార్థుల ప్రవేశము కొరకై ఆన్ లైన్ ద్వారా MPC /BiPC/MEC/CEC గ్రూప్ లలో ఉచిత విద్య పొందగోరు విద్యార్థుల నుండి దరఖాస్తులు కోరబడుచున్నవి. ఈ ఆదర్శపాఠశాలలలో బోధనామాధ్యమము ఆంగ్లములో ఉండును. ఈ పాఠశాలలో విద్యనభ్యసించుటకు ఎటువంటి ఫీజులు వసూలు చేయబడవు. (AP Model schools APMS Inter Admission Notification 2025-26)
ప్రవేశ అర్హతలు:
సంబంధిత జిల్లాల్లో ప్రభుత్వ లేక ప్రభత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 10వ తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేయడానికి ముందుగా వివరాలతో కూడిన సమాచారము కొరకు వెబ్ సైట్ https://apms.apcfss.in మరియు https://cse.ap.gov.in చూడగలరు .
దరఖాస్తు చేయు విధానము:
అభ్యర్థులు పైన తెలుపబడిన అర్హత పరిశీలించి సంతృప్తి చెందిన తర్వాత తేదీ.17.03.2025 నుండి 22.05.2025 వరకు net banking/credit/debit card లను ఉపయోగించి gate way ద్వారా అప్లికేషన్ రుసుము చెల్లించిన తరువాత వారికి ఒక జనరల్ నెంబరు కేటాయించబడును. ఆ జనరల్ నెంబరు ఆధారంగా వెబ్ సైట్ https://apms.apcfss.in మరియు https://cse.ap.gov.in లో దరఖాస్తు చేసుకొనవలయును.
దరఖాస్తు చేయడానికి రుసుము:
OC, BC మరియు EWS లకు రూ.200/- (అక్షరములా రెండు వందల రూపాయలు మాత్రమే) SC మరియు ST లకు రూ.150/- (అక్షరములా నూట యాబై రూపాయలు మాత్రమే).
రిజర్వేషన్
ప్రవేశములు 10 వ తరగతి మార్కుల మెరిట్ ద్వారా రిజర్వేషన్ రూల్స్ ప్రకారం ఇవ్వబడును. ఇతర వివరములకు ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ ను గాని లేక సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారిని /మండల విద్యాశాఖాధికారిని సంప్రదించగలరు.
ముఖ్యమైన తేదీలు (APMS Intermediate Admission Notification Schedule)
S.No. | Item of Work | Schedule |
1. | Issue of admission notification by the Head Office | 12.03.2025 |
2. | Date of payment of Registration fee | 17.03.2025 |
3. | Acceptance of Online Application | 18.03.2025 |
4. | Closing of application | 22.05.2025 |
5. | Publication of Online Applicants list by IT Cell and Communication to Districts | 23.05.2025 |
6. | Preparation of merit list at school level by the Concerned Principal | 24.05.2025 |
7. | Publication of Selection List by the DEO after the approval of Selection Committee | 26.05.2025 |
8. | Certificate Verification at School level | 27.05.2025 |
9. | Commencement of Classes & Orientation to Parents & Students | June 2025 (as decided by the Govt.) |
Detailed.. AP Model school Inter Admission Notification pdf
Read also..