AP Model Schools (APMS) 6th Class Admission Notification 2026-27
ఆంధ్రప్రదేశ్ ఆదర్శ పాఠశాలలలో 2026 – 27 విద్యా సంవత్సరములొ 6వ తరగతిలొనికి ప్రవేశము కొరకు ప్రకటన
నోటిఫికేషన్
తేది: 16-02-2026
ఆంధ్రప్రదేశ్ లోని 164 మోడల్ స్కూల్స్ (ఆదర్శ పాఠశాలల)లో 2026-2027 విద్యా సంవత్సరమునకు ‘6’ వ తరగతి లో విద్యార్థులను చేర్చుకొనుటకై తేది. 12.04.2026 (ఆదివారము) నాడు రాష్ట్ర వ్యాప్తముగా ప్రవేశ పరీక్షలు నిర్వహించబడును. ఏ మండలములో ఆదర్శ పాఠశాలలు పనిచేయుచున్నవో ఆ పాఠశాలల యందే 12.04.2026 న ఉ. 10-00 గం.ల నుండి ఉ. 12-00 గం. ల వరకు ప్రవేశ పరీక్ష నిర్వహించబడును. ఈ ప్రవేశ పరీక్షకు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులు కోరబడుచున్నవి. ప్రవేశ పరీక్ష 5వ తరగతి స్థాయిలో తెలుగు /ఇంగ్లీషు మీడియములో నిర్వహించబడును. ఈ ఆదర్శ పాఠశాలలో బోధనామాధ్యమము ఆంగ్లములోనే ఉండును. ఈ పాఠశాలలో విద్యనభ్యసించుటకు ఎటువంటి ఫీజులు వసూలు చేయబడవు. (AP Model Schools (APMS) 6th Class Admission Notification 2026-27)
AP Model schools Admission Eligibility criteria (ప్రవేశ అర్హతలు):
- వయస్సు: OC, BC కులాలకు చెందిన విద్యార్థులు 01-09-2014 నుండి 31-08-2016 మధ్య పుట్టి ఉండాలి. యస్.సి., యస్.టి. (SC, ST) కులాలకు చెందిన విద్యార్థులు 01-09-2012 నుండి 31-08-2016 పుట్టి ఉండాలి.
- సంబంధిత జిల్లాలో ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలలో నిరవధికంగా 2024-25 మరియు 2025-26 విద్యా సంవత్సరములు చదివి ఉండాలి. 2025-26 విద్యా సంవత్సరములో 5 వ తరగతి చదువుతూ ప్రమోషన్ అర్హత పొంది ఉండాలి.
- దరఖాస్తు చేయడానికి ముందుగా వివరాలతో కూడిన సమాచారపత్రము కొరకు www.cse.ap.gov.in లేదా www.apms.apcfss.in చూడగలరు.
APMS Application Process (దరఖాస్తు చేయు విధానము):
- అభ్యర్థులు పై అర్హత పరిశీలించి సంతృప్తి చెందిన తర్వాత తేది. 23-02-2026 నుండి తేది.31-03-2026 Net banking/ credit/debit card లను ఉపయోగించి Payment Gateway ద్వారా పరీక్ష రుసుము చెల్లించిన తరువాత వారికి ఒక జనరల్ నెంబరు కేటాయించబడును. ఆ జనరల్ నెంబరు ఆధారముగా ఏదేని ఇంటర్ నెట్ www.cse.ap.gov.in/ www.apms.ap.gov.in (Online లో) దరఖాస్తు చేసుకోవలెను.
APMS Application fee (పరీక్షా రుసుము):
- OC మరియు BC లకు: రూ. 200/- , SC మరియు ST లకు రూ.150/-.
ముఖ్య విషయములు
- 6 వ తరగతి ప్రవేశమునకు పై ప్రవేశ పరీక్షల్లో OC మరియు BC విద్యార్థులు మార్కులు 35 మార్కులు SC మరియు ST విద్యార్థులు కనీసం 30 పొందియుండవలెను.
- ప్రవేశములు ప్రతిభ ఆధారముగా (అనగా ప్రవేశ పరీక్షలో పొందిన మార్కుల ఆధారముగా) మరియు రిజర్వేషన్ రూల్స్ ప్రకారము ఇవ్వబడును.
- ప్రవేశపరీక్షా ప్రశ్నాపత్రము Objective Type లో వుండును. ఇతర వివరములకు ఆదర్శ ప్రిన్సిపాల్ ను గాని లేక సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారిని/ మండల విద్యాశాఖాధికారిని సంప్రదించగలరు.
ముఖ్యమైన తేదీలు (APMS 6th Class Admission Notification Tentative Schedule)
| S.No. | Item of Work | Schedule |
| 1. | Date of Issue Press Note | 16-02-2026 |
| 2. | Date of gateway payment of Examination fee | 23-02-2026 |
| 3. | Acceptance of Online Application | 24-03-2026 |
| 4. | Last Date for fee Payment | 31-03-2026 |
| 5. | Date of Examination(at School) | 12-04-2026 |
| 6. | Publication of Merit List | 27-04-2026 |
| 7. | Publication of Selection List | 27-04-2026 |
| 8. | Certificate Verification & Counselling | 30-04-2026 |
| 9. | Date of Commencement of Classes | June 2026 (As decided by the Govt.) |
NOTIFICATION – DOWNLOAD
SCHEDULE – DOWNLOAD
PAYMENT – CLICK HERE
APPLICATION LINK – CLICK HERE
WEBSITE – CLICK HERE
Thank you for reading... Share this...
