AP Model schools APMS 6th Class Admission Notification 2025-26

AP Model schools APMS 6th Class Admission Notification 2025-26

ఆంధ్రప్రదేశ్ ఆదర్శ పాఠశాలలలో 2025 – 26 విద్యా సంవత్సరములొ 6వ తరగతిలొనికి ప్రవేశము కొరకు ప్రకటన
నోటిఫికేషన్
తేది: 21-02-2025

ఆంధ్రప్రదేశ్ లోని 164 మోడల్ స్కూల్స్ (ఆదర్శ పాఠశాలల)లో 2025-2026 విద్యా సంవత్సరమునకు ‘6’ వ తరగతి లో విద్యార్థులను చేర్చుకొనుటకై తేది. 20.04.2025 (ఆదివారము) నాడు రాష్ట్ర వ్యాప్తముగా ప్రవేశ పరీక్షలు నిర్వహించబడును. ఏ మండలములో ఆదర్శ పాఠశాలలు పనిచేయుచున్నవో ఆ పాఠశాలల యందే 20.04.2025 న ఉ. 10-00 గం.ల నుండి ఉ. 12-00 గం. ల వరకు ప్రవేశ పరీక్ష నిర్వహించబడును. ఈ ప్రవేశ పరీక్షకు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులు కోరబడుచున్నవి. ప్రవేశ పరీక్ష 5వ తరగతి స్థాయిలో తెలుగు /ఇంగ్లీషు మీడియములో నిర్వహించబడును. ఈ ఆదర్శ పాఠశాలలో బోధనామాధ్యమము ఆంగ్లములోనే ఉండును. ఈ పాఠశాలలో విద్యనభ్యసించుటకు ఎటువంటి ఫీజులు వసూలు చేయబడవు. (AP Model schools APMS 6th Class Admission Notification 2025-26)

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

AP Model schools Admission Eligibility criteria  (ప్రవేశ అర్హతలు):

  • వయస్సు: OC, BC కులాలకు చెందిన విద్యార్థులు 01-09-2013 నుండి 31-08-2015 మధ్య పుట్టి ఉండాలి. యస్.సి., యస్.టి. (SC, ST) కులాలకు చెందిన విద్యార్థులు 01-09-2011 నుండి 31-08-2015 పుట్టి ఉండాలి.
  • సంబంధిత జిల్లాలో ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలలో నిరవధికంగా 2023-24 మరియు 2024-25 విద్యా సంవత్సరములు చదివి ఉండాలి. 2024-25 విద్యా సంవత్సరములో 5 వ తరగతి చదువుతూ ప్రమోషన్ అర్హత పొంది ఉండాలి.
  • దరఖాస్తు చేయడానికి ముందుగా వివరాలతో కూడిన సమాచారపత్రము కొరకు www.cse.ap.gov.in లేదా www.apms.apcfss.in చూడగలరు.

APMS Application Process (దరఖాస్తు చేయు విధానము):

  • అభ్యర్థులు పై అర్హత పరిశీలించి సంతృప్తి చెందిన తర్వాత తేది. 24-02-2025 నుండి  తేది.31-03-2025 Net banking/ credit/debit card లను ఉపయోగించి Payment Gateway ద్వారా పరీక్ష రుసుము చెల్లించిన తరువాత వారికి ఒక జనరల్ నెంబరు కేటాయించబడును. ఆ జనరల్ నెంబరు ఆధారముగా ఏదేని ఇంటర్ నెట్ www.cse.ap.gov.in/ www.apms.ap.gov.in (Online లో) దరఖాస్తు చేసుకోవలెను.

APMS Application fee (పరీక్షా రుసుము):

  • OC మరియు BC లకు: రూ. 150/- (అక్షరాల 150/-రూపాయలు మాత్రమే) SC మరియు ST లకు రూ.75/- (అక్షరాల 75/- రూ. మాత్రమే)

ముఖ్య విషయములు

  • 6 వ తరగతి ప్రవేశమునకు పై ప్రవేశ పరీక్షల్లో OC మరియు BC విద్యార్థులు మార్కులు 35 మార్కులు SC మరియు ST విద్యార్థులు కనీసం 30 పొందియుండవలెను.
  • ప్రవేశములు ప్రతిభ ఆధారముగా (అనగా ప్రవేశ పరీక్షలో పొందిన మార్కుల ఆధారముగా) మరియు రిజర్వేషన్ రూల్స్ ప్రకారము ఇవ్వబడును.
  • ప్రవేశపరీక్షా ప్రశ్నాపత్రము Objective Type లో వుండును. ఇతర వివరములకు ఆదర్శ ప్రిన్సిపాల్ ను గాని లేక సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారిని/ మండల విద్యాశాఖాధికారిని సంప్రదించగలరు.

ముఖ్యమైన తేదీలు (APMS 6th Class Admission Notification Tentative Schedule)

S.No.Item of WorkSchedule
1.Date of Issue Press Note21-02-2025
2.Date of gateway payment of Examination fee24-02-2025
3.Acceptance of Online Application25-03-2025
4.Last Date for fee Payment31-03-2025
5.Date of Examination(at School)20-04-2025
6.Publication of Merit List27-04-2025
7.Publication of Selection List27-04-2025
8.Certificate Verification & Counselling30-04-2025
9.Date of Commencement of ClassesJune 2025 (As decided by the Govt.)

AP Model schools APMS 6th Class Admission Notification 2025-26 pdf

DOWNLOAD

Official website CLICK HERE

School Education – A.P Model Schools – Conduct of Entrance test for admission into VI class for the academic year 2025-26 in 164 A.P Model schools – Certain Instructions

Rc.No.ESE02-34/2/2022-AD-APMS, Dated: 21-02-2025

DOWNLOAD

Read also..

AP Model schools APMS Intermediate Admission Notification 2025-26

CLICK HERE

Thank you for reading... Share this...
Trending Information
error: Content is protected !!