AP Half Day Schools Time table 2025

AP Half Day Schools Time table 2025

ఈ ఏడాది ఎండలు తీవ్రంగా ఉంటాయన్న హెచ్చరికల నేపథ్యంలో ఏపీ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకున్నది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో మార్చి 15 నుంచి ఒంటి పూట బడులు నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. దీనికి సంబంధించిన ప్రణాళికను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. (AP Half Day Schools Time table 2025)

ఈ ఏడాది మార్చి, ఏప్రిల్, మే నెలల్లో ఎండ తీవ్రత సాధారణం కంటే అధికంగా ఉంటుంద‌ని అలాగే వడగాలులు కూడా తీవ్రంగా ఉంటాయని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసినదే. తెలంగాణ విద్యాశాఖ కూడా మార్చి 15వ తేదీ నుండి ఒంటిపూట బడులు నిర్వ‌హించనున్నది.

అకడమిక్ క్యాలెండర్, 2024-25 ప్రకారం అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేటు యాజమాన్యము లలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత మరియు ఉన్నత పాఠశాలలు ఒంటిపూట బడులు తేది: 15.03.2025 నుండి 23.04.2025 వరకు 07:45 AM నుండి 12.30 PM వరకు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. అలాగే 10 వ తరగతి పబ్లిక్ పరీక్ష కేంద్రాలు గల పాఠశాలలు మాత్రం మధ్యాహ్నం 01.00 PM నుండి 05.00 PM వరకు పాఠశాలలు పని చేయవలెను. ఎండ తీవ్రత దృష్ట్యా గ్రామ పంచాయితీ మరియు RWS సహకారం తో త్రాగునీటి వసతి ప్రతి పాఠశాలలో ఏర్పాటు చేయాలని, వైద్య ఆరోగ్య శాఖ వారి సహకారం తో ORS ప్యాకెట్లు పాఠశాలలలో అందుబాటులో ఉంచుకోవాలని,  పాఠశాల సమయం ముగిసిన తరువాత MDM విద్యార్థులకు వడ్డించాలి.

Important Instructions

  1. Strictly implement the half-a-day school timings as per the School academic calendar.
  2. 2nd Saturday in the month of April should be counted as working day.
  3. Adequate drinking water should be provided in all schools with the support of Gram Panchayat & RWS Department wherever and whenever required.
  4. Classes shall not be conducted in open areas / under the trees etc., under any circumstances.
  5. Keep handy some Oral Re-hydration Solution (ORS) sachets in every school for use of Students, in coordination with the Medical & Health Department for use in case if any child affected by Sun / Heat stroke.
  6. Provide buttermilk during Mid-Day Meals in coordination with local community / Voluntary organizations.
  7. Mid-Day-Meals should be prepared and supplied to the students at the end of school hours and then send students to their homes.
  8. Monitor the above measures closely with the Headmasters, Inspecting Officers and other officials and see that all precautions are taken to avoid any hardship to the Students /
    Teachers.
    The above instructions shall not affect the schedule already issued for the SA -2 exams for classes 1 to 9.

దీనికి సంబంధించిన  ఏపీ పాఠశాల విద్యాశాఖ అధికారిక ప్రకటన క్రింద చూడవచ్చు.

Half Day Schools Time table 2025 (as per Academic calendar)

PeriodTime
మొదటి గంట7.45 am
రెండవ గంట7.50 am
అసెంబ్లీ7.50 am – 8.00 am
మొదటి పీరియడ్8.00 am – 8.40 am
రెండవ పీరియడ్8.40 am – 9.20 am
మూడవ పీరియడ్9.20 am – 10.00 am
కొద్ది విరామం10.00 am – 10.30 am
నాల్గవ పీరియడ్10.30 am – 11.10 am
ఐదవ పీరియడ్11.10 am – 11.50 am
ఆరవ పీరియడ్11.50 am – 12.30 pm

Half Day Schools Time table 2025 (Recommended)

Half Days Time table in pdf

DOWNLOAD

Official proceedings 

DOWNLOAD

Sharing is caring!

error: Content is protected !!