Two Good New for AP GOVT Employees – Clarity on CPS and Enhancement of Retirement Age
ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల కు రెండు శుభవార్తలు – సీపీఎస్ పై స్పష్టత & పదవీ విరమణ వయసు పెంపు – క్యాబినెట్ ఆమోదం
CPS
ఉద్యోగుల గ్రాట్యుటీ మేరకు ఫ్యామిలీ పెన్షన్ మంజూరుకు నిర్ణయం తీసుకుంది. వెటరన్, ఫ్యామిలీ సీపీఎస్ కంట్రిబ్యూషన్ పై స్పష్టత ఇచ్చింది. ఉద్యోగుల గ్రాట్యుటీ మేరకు ఫ్యామిలీ పెన్షన్ మంజూరు చేయాలని నిర్ణయించింది. 2017 నుంచి పెండింగ్ లో ఉన్న ఈ సమస్యను ప్రభుత్వం పరిష్కరించింది.
అలాగే, మెమో-57 ప్రకారం 2004 సంవత్సరానికి ముందు నోటిఫికేషన్ ద్వారా నియమితులైన సుమారు 11 వేల మంది ఉద్యోగులకు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్(CPS) నుంచి పాత పెన్షన్ విధానం (OPS) అమలు చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
పదవీ విరమణ వయసు పెంపు (Retirement Age)
ప్రభుత్వరంగ సంస్థల్లో పనిచేసే ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వరంగ సంస్థలు, గురుకుల విద్యాసంస్థలు, సొసైటీ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 ఏళ్ల నుంచి 62 ఏళ్ల పెంపునకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
Thank you for reading... Share this...
