AP EdCET 2025 Results and Rank cards
ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్-2025 (AP EdCET- 2025) ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం గా 99.42శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ X లో ట్వీట్ చేశారు. ఈ ప్రవేశ పరీక్ష ఆచార్య నాగర్జున యూనివర్సిటీ, గుంటూరు ఆద్వర్యంలో జూన్ 5న నిర్వహించారు. ఈ మేరకు ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (APSCHE) వెబ్ సైట్లో ఫలితాలతో పాటు ర్యాంక్ కార్డును పొందుపరిచింది. (AP EdCET 2025 Results and Rank cards)
పరీక్షకు 17,795 మంది దరఖాస్తు చేసుకోగా 14,612 మంది హాజరయ్యారు. వీరిలో 14,527 మంది క్వాలిఫై అయ్యారు. ఇటీవలే కీతో పాటు రెస్పాన్స్ షీట్స్, మాస్టర్ ప్రశ్నపత్రం అందుబాటులో ఉంచింది. దీని ద్వారా 2025-26 విద్యా సంవత్సరానికి బీఈడీ, బీఈడీ (స్పెషల్) కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
