WhatsApp Channel Join Now
Telegram Group Join Now

AP DSC 2025 Hall tickets

AP DSC 2025 Hall tickets

జూలై 1, 2 తేదీల్లో జరగబోయే డీఎస్సీ పరీక్షల కొత్త హాల్ టికెట్లు విడుదల

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని, అభ్యర్థులను దృష్టిలో  ఉంచుకుని రాకపోకలకు ఇబ్బంది కలగకుండా 20.06.2025 మరియు 21.06.2025 జరుగవలసిన మెగా DSC–2025 నియామక పరీక్షలను 01.07.2025 మరియు 02.07.2025 తేదీలకు మార్పుచేసిన సంగతి తెలిసినదే. ఈ నేపథ్యంలో మార్పుచేసిన పరీక్షా కేంద్రాలు,  పరీక్ష తేదీల కొత్త  హాల్ టిక్కెట్లు నేటి నుండి (25.06.2025) నుండి మెగా డీఎస్సీ https://apdsc.apcfss.in  వెబ్సైట్లో  అందుబాటులో ఉంటాయని మెగా డీఎస్సీ కన్వీనర్ శ్రీ ఎం.వి కృష్ణారెడ్డి గారు ఒక ప్రకటనలో తెలిపారు .  అభ్యర్థులు తమ కొత్త హాల్ టిక్కెట్లు డౌన్లోడ్ చేసుకొని, ఒకటికి రెండు సార్లు పరీక్షా కేంద్రాలు సరిచూసుకుని, పరీక్షా కేంద్రాలను ఖచ్చితంగా నిర్ధారించుకొని, పరీక్షకు హాజరు కావలసినదిగా తెలిపారు. (AP DSC 2025 Hall tickets)

How to Download AP DSC Hall Ticket 2025:

  • Go to the official AP DSC website: https://apdsc.apcfss.in
  • Select the “Candidate Login” option on the main page.
  • Input your Username and password
  • Enter captcha code
  • Press “Sign in” to view your hall ticket.
  • Save the PDF and print it for later use.

AP DSC 2025 Official website CLICK HERE

నేడు విడుదల కానున్న డీఎస్సీ-2025 హాల్ టికెట్లు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న డీఎస్సీ 2025 హాల్ టికెట్లను విద్యాశాఖ వెబ్ సైట్లో అందుబాటులో ఉంచినది. ఈ మెగా డీఎస్సీ 2025 కు మొత్తం 16,347 పోస్టులకు ఏప్రిల్ 20 నుంచి 15వ తేదీ వరకు ఆన్ లైన్లో దరఖాస్తులు స్వీకరించగా 5.67 లక్షల మంది దరఖాస్తు చేశారు. ఆరేళ్ల నుంచి డీఎస్సీ భర్తీ ప్రక్రియ లేకపోవడంతో అభ్యర్థులు వాటిపైనే ఆధారపడి పరీక్షకు సన్నద్ధమవుతున్నారు. పరీక్షలకు సమయం సరిపోదని, కనీసం 90 రోజులు ఉండాలని, తెలంగాణ రాష్ట్రం తరహాగా జనరల్ అభ్యర్థుల వయస్సును 47 ఏళ్లకు పెంచాలంటూ కొందరు అభ్యర్థులు సుప్రీం కోర్టును ఆశ్రయించినప్పటికీ డీఎస్సీ షెడ్యూలులో ఎలాంటి మార్పులేదని ప్రభుత్వం తేల్చిచెప్పింది.

ఈ మెగా డీఎస్సీ 2025 పరీక్షలు సిబిటి పద్ధతిలో జూన్ 6 నుంచి జులై 6 వరకు నెల రోజుల పాటు జరగనున్నాయి. డీఎస్సీలో టీజీటీ, స్కూల్ అసిస్టెంట్, ఎస్జీటీ పోస్టులకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) వెయిటేజీ 20 శాతం ఉంటుంది. మిగిలిన ప్రిన్సిపల్, పీజీటీలకు 100 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు.

Read also..

Mega DSC 2025 Useful Study materials

CLICK HERE

DSC Practice Bits

CLICK HERE

Thank you for reading... Share this...
error: Content is protected !!