AP BIE Intermediate Exams 2025-26 New pattern
ఇంటర్ లో ఎంబైపీసీ
వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంటర్ విద్యా మండలి ఇంటర్మీడియట్ విద్యలో పలు కీలక మార్పులు రానున్నాయి. సబ్జెక్టుల కాంబినేషన్లు, సిలబస్-పాఠ్యపుస్తకాల సవరణ సంస్కరణలు 2025-26 విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి రానున్నాయి. సబ్జెక్టుల కాంబినేషన్లో భాగంగా ఇకపై ఇంటర్ లో కొత్తగా ఎంబైపీసీ అందుబాటులోకి వస్తుంది. ఎంపీసీ, బైపీసీల సబ్జెక్టులను కలిపి ఎంజైపీసీని తీసుకోస్తున్నారు. ఎంబైపీసీ చదివిన విద్యార్థులు ఉన్నత విద్యలో ఇంజనీరింగ్, మెడిసిన్ లలో ఏదైనా కోర్సులో జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అన్ని ప్రభుత్వ కాలేజీల్లో దీన్ని ప్రవేశపెట్టనున్నారు. అలాగే వచ్చే ఏడాది నుంచి మొత్తం ఎన్సీఈఆర్టీ సిలబస్ ను అమలుచేయాలని ఇంటర్ బోర్డు మరో నిర్ణయం తీసుకుంది. కోర్ గ్రూపు సబ్జెక్టుల్లో ఎన్సీఈఆర్టీ సిలబస్ ను యథావిధిగా అమలుచేసి, మిగిలిన భాషా, ఆర్ట్స్ గ్రూపుల్లో కీలక మార్పులు తీసుకొస్తోంది. (AP BIE Intermediate Exams 2025-26 New pattern)
సైన్స్ విద్యార్థులకు అదనపు సబ్జెక్టు ఆప్షనల్:
ప్రస్తుతం ఇంటర్మీడియట్ లో ఆరు సబ్జెక్టుల విధానం ఉండగా, ఇకపై ఐదు సబ్జెక్టుల విధానం అమల్లోకి వస్తుంది. మొదటి సబ్జెక్టుగా ఇంగ్లీష్ ఉంటుంది. ఇక తెలుగు లేదా సంస్కృతం సబ్జెక్టు ఆప్షనల్ అవుతాయి. వాటి స్థానంలో విద్యార్థులు కోర్ సబ్జెక్టును కూడా ఎంచుకోవచ్చు. మిగిలిన మూడు కోర్ సబ్జెక్టులు యథావిధిగా ఉంటాయి. ప్రస్తుతం ఇంటర్ ఎంపీసీలో గణితం ఎ, బి పేరుతో రెండు సబ్జెక్టులుగా ఉంది. అది ఇకపై ఒకటే అవుతుంది. అలాగే బైపీసీలో ఉన్న బోటనీ, జువాలజీ కలిపి బయాలజీగా మారుతుంది. ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకు అదనపు సబ్జెక్టు ఆప్షనల్ గా ఉంటుంది. ఆరో సబ్జెక్టుగా నచ్చిన సబ్జెక్టును కావాలంటే ఎంపిక చేసుకోవచ్చు, అరులో ఐదు సబ్జెక్టుల్లో ఉత్తీర్ణులైతే ఇంటర్ ఉత్తీర్ణత సాధిస్తారు. ఇక ఆర్ట్స్ గ్రూపుల విద్యార్థులు కూడా గణితం, బయాలజీలను ఆప్షనల్ సబ్జెక్టు కింద తీసుకోవచ్చు. అయితే ఆర్ట్స్ గ్రూపుల్లో ఐదు సబ్జెక్టులు దాటవు. ఆరో సబ్జెక్టు అప్షన్ ఉండదు. రెండో సబ్జెక్టు స్థానంలో ఆప్షనల్ ను ఎంచుకోవచ్చు
మార్కుల కేటాయింపు:
MPC COURSE NEW PATTERN FROM 2025-26
| JUNIOR INTERMEDIATE | |
| English | 100 |
| Optional | 100 |
| Mathematics | 100 |
| Physics | 85 |
| Chemistry | 85 |
| TOTAL | 470 |
| SENIOR INTERMEDIATE | |
| English | 100 |
| Optional | 100 |
| Mathematics | 100 |
| Physics | 85 |
| Chemistry | 85 |
| TOTAL | 470 |
| PRACTICALS | |
| Physics | 30 |
| Chemistry | 30 |
| Grand Total | 1000 |
BiPC COURSE NEW PATTERN FROM 2025-26
| JUNIOR INTERMEDIATE | |
| English | 100 |
| Optional | 100 |
| Biology | 85 |
| Physics | 85 |
| Chemistry | 85 |
| TOTAL | 455 |
| SENIOR INTERMEDIATE | |
| English | 100 |
| Optional | 100 |
| Biology | 85 |
| Physics | 85 |
| Chemistry | 85 |
| TOTAL | 455 |
| PRACTICALS | |
| Physics | 30 |
| Chemistry | 30 |
| Biology | 30 |
| Grand Total | 1000 |
CEC COURSE NEW PATTERN FROM 2025-26
| JUNIOR INTERMEDIATE | |
| English | 100 |
| Optional | 100 |
| Commerce | 100 |
| Economics | 100 |
| Civics | 100 |
| TOTAL | 500 |
| SENIOR INTERMEDIATE | |
| English | 100 |
| Optional | 100 |
| Commerce | 100 |
| Economics | 100 |
| Civics | 100 |
| TOTAL | 500 |
| Grand Total | 1000 |
MEC COURSE NEW PATTERN FROM 2025-26
| JUNIOR INTERMEDIATE | |
| English | 100 |
| Optional | 100 |
| Mathematics | 100 |
| Economics | 100 |
| Commerce | 100 |
| TOTAL | 500 |
| SENIOR INTERMEDIATE | |
| English | 100 |
| Optional | 100 |
| Mathematics | 100 |
| Economics | 100 |
| Commerce | 100 |
| TOTAL | 500 |
| Grand Total | 1000 |
ఫెయిలైనా చదవొచ్చా..?
ఎంబైపీసీ చదివే విద్యార్ధి గణితంలో ఫెయిల్ అయ్యి ఆప్షనల్గా తీసుకున్న ఆరో సబ్జెక్టులో పాస్ అయితే ఇంటర్ సర్టిపికెట్ చేతికి వస్తుంది. అయితే ఇక్కడే ఓ సందేహం తలెత్తుతోంది. గణితంలో ఫెయిల్ అయిన ఆ విద్యార్థి ఇంజనీరింగ్ చేయొచ్చా? అలాగే ఎంటైపీసీ చదివిన విద్యార్థి బయాలజీలో ఫెయిల్ అయి, ఆప్షనల్ సబ్జెక్టులో పాస్ అయితే మెడిసిన్ చదవొచ్చా? అనే ప్రశ్నలు వస్తున్నాయి. ఇలా ఉన్నత విద్యకు అవసరమైన కోర్ సబ్జెక్టుల్లో ఫెయిలైన విద్యార్థులు ఆయా ఉన్నత విద్య కోర్సుల్లో చేరవచ్చా? లేదా? అనేది యూనివర్సిటీల నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని ఇంటర్ బోర్డు అధికారులు చెబుతున్నారు. దేశంలోని ఆయా యూనివర్సిటీల ఆడ్మిషన్ నిబంధనల ప్రకారం వారిపై నిర్ణయం ఉంటుందని అంటున్నారు.
Proposal of New Subjects Combination, Proposed List of Elective Subjects or Additional Subjects & Proposed Changes in Examination Marks Pattern
Read also..
