WhatsApp Channel Join Now
Telegram Group Join Now

Amazing Health Benefits of Buttermilk

Amazing Health Benefits of Buttermilk

పెరుగులో నీరు కలిపి చిలికితే వచ్చే పలుచని పానీయం మజ్జిగ. మజ్జిగ అనేది పులియబెట్టిన పాల ఉత్పత్తి. వేసవిలో అలా బయటకు వెళ్లి వచ్చినప్పుడు ఓ గ్లాసుడు మజ్జిగ తాగితే ప్రాణం లేచి వచ్చినట్లుంది. మజ్జిగ ను వేసవికాలంలో దాహాన్ని తీర్చే చక్కని పానీయంగా ఉపయోగిస్తారు. దీనిలో కొంచెం కరివేపాకు, అల్లం, పచ్చి మిరపకాయలు వేసి కొంతసేపు  ఉంచితే  ఇంకా రుచిగా ఉంటుంది. (Amazing Health Benefits of Buttermilk)

మజ్జిగ లోని పోషకాలు:-

  • కాల్షియం, విటమిన్ బి12, రిబోఫ్లేవిన్, విటమిన్ డి, పొటాషియం, సోడియం, విటమిన్ బి6 వంటి పోషకాలు మజ్జిగలో ఉంటాయి.
  • మజ్జిగలో ప్రోటీన్లు మరియు లాక్టిక్ యాసిడ్ కూడా ఉంటాయి.

మజ్జిగతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు (Buttermilk Health Benefits):

  • జీర్ణవ్యవస్థకు మేలుచేసే బ్యాక్టీరియాను ఉత్పత్తి చేస్తుంది.
  • శరీరంలోని వేడిని నియంత్రిస్తుంది జలుబు, జ్వరం, ఇన్ఫెక్షన్లను రాకుండా నివారిస్తుంది.
  • గుండెల్లో మంటను, ఎసిడిటిని తగ్గిస్తుంది.
  • ఎసిడిటీ సమస్య నుండి ఉపశమనం పొందడానికి ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో మజ్జిగ తాగడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే మజ్జిగ యాసిడ్ రిఫ్లక్స్‌ను తొలగిస్తుంది.
  •  గ్యాస్, అల్సర్ సమస్యలు ఉన్నవారికి  ప్రతిరోజు మజ్జిగ తీసుకోవడం వలన మంచి ఫలితం ఉంటుంది.
  • మలబద్దకం సమస్య దూరమవుతుంది.
  • ఎముకలను, చర్మాన్ని సంరక్షిస్తుంది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.
  • మజ్జిగలో రెండు, మూడు కరివేపాకులు, అర టీస్పూన్ మిరియాల పొడి వేసుకుని తాగితే శరీరంలో ఉండే కొవ్వు కరుగుతుంది.
  • బయటికెళ్తే డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటారు.
  • పరగడుపున మజ్జిగలో అర టీస్పూన్ అల్లం కలిపి తాగితే విరేచనాలు తగ్గుతాయి.
  • ఉదయం పూట ఖాళీ కడుపుతో మజ్జిగ తాగడం వల్ల రోజంతా ఎనర్జిటిక్‌గా ఉంటుంది.
  • వేసవి కాలంలో అధిక చెమట కారణంగా శరీరంలో డీహైడ్రేషన్ సమస్య ఉంటుంది. మజ్జిగ తాగడం వల్ల శరీరం చల్లబడి హైడ్రేట్ గా ఉంచుతుంది.
  • మజ్జిగ తాగడం వల్ల రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు, ట్రైగ్లిజరైడ్స్ తగ్గుతాయి.
  • మజ్జిగ బీపీని తగ్గిస్తుంది.
  • మజ్జిగలో వుండే విటమిన్- ఎ రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
  • శరీరాన్ని చల్లగా ఉంచుతుంది.
  • మ‌జ్జిగ‌ను తాగ‌డం వ‌ల్ల ర‌క్త స‌ర‌ఫ‌రా మెరుగు ప‌డుతుంది.
  • మజ్జిగలో కాల్షియం ,  విటమిన్ డి పుష్కలంగా ఉంటాయి
  • మజ్జిగలో ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇది శరీరంలోని ప్రేగుల పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. అలాగే దీన్ని రోజూ తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ బలపడుతుంది.
  • శరీర బరువు తగ్గాలంటే రోజు రెండు సార్లు మజ్జిగ తాగాలని సూచిస్తున్నారు పోషకాహార నిపుణులు.
  • ఇవి శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తాయి. మనం ఎక్కువగా వేయించిన లేదా స్పైసీ ఫుడ్ తిన్నప్పుడల్లా శరీరం లోపల ఉష్ణోగ్రత పెరుగుతుంది. 1 గ్లాసు మజ్జిగ తాగడం వల్ల ఈ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.
  • పాలతో పోలిస్తే మజ్జిగలో కేలరీలు తక్కువగా ఉంటాయి.  ఇందుకోసం రోజులో ఎప్పుడైనా మజ్జిగ తాగవచ్చు.

Read also..

Ice Apple/ Palmyra Palm: Uses, Benefits, Side Effects

CLICK HERE

Thank you for reading... Share this...
error: Content is protected !!