25% 1st Class Seats Reserved for Disadvantaged Children in AP Private Schools
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం :: పాఠశాల విద్యాశాఖ – సమగ్ర శిక్షా
పత్రికా ప్రకటన (16.04.2025)
2025 2026 విద్యా సంవత్సరంలో అన్ని ప్రైవేటు అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో (IB/CBSE/ICSE/State Syllabus ) 2009-25 12 (1) సి అమలు (5 సంవత్సరములు నిండిన పిల్లలకు 1వ తరగతిలో ప్రవేశం కొరకు) (25% 1st Class Seats Reserved for Children in AP Private Schools)
విద్యాహక్కు చట్టం-2009, సెక్షన్ 12(1) Cప్రకారం 2025-2026 విద్యా సంవత్సరమునకు గాను, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్న మరియు బలహీన వర్గాల పిల్లలకు రాష్ట్రంలోని వారి నివాస సమీప ప్రాంతంలో అన్ని ప్రైవేటు ఆన్ ఎయిడెడ్ పాఠశాలలో 1వ తరగతిలో 25% సీట్లు కేటాయించుట జరిగినది. సదరు విద్యా హక్కు చట్టం-2009, సెక్షన్ 12(1)C అమలులో భాగంగా 2025 2026 విద్యా సంవత్సరంలో IB/CBSE/ICSE/State Syllabus అనుసరిస్తున్న పాఠశాలలలో, 1వ తరగతిలో ప్రవేశం కొరకు 28.04.2025 నుండి 15.05.2025 వరకు సదరు వర్గాలకు చెందిన పిల్లల నుండి దరఖాస్తులు ఆహ్వానించుచున్నారు.
విద్యార్థులు ఆధార్ ద్వారా, ప్రాథమిక వివరాలతో http://cse.ap.gov.in వెబ్ సైట్ నందు కేటాయింపు జరుగును. ఎంపికైన విద్యార్థుల జాబితా వివరాలను సంబంధిత పాఠశాలలో చూడవచ్చు. విద్యార్థుల తల్లిదండ్రులు, సంబంధిత గ్రామ సచివాలయం/ మండల విద్యా వనరుల కేంద్రము/ సంబంధిత పాఠశాల నుండి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర విషయాల కొరకు సంబంధిత జిల్లా విద్యాశాఖ అధికారిని సంప్రదించవచ్చు. Toll Free: 18004258599
దరఖాస్తు సమర్పించుటకు కావలసిన డాక్యుమెంట్స్
- ప్రస్తుత చిరునామా ధ్రువీకరణ కొరకు: తల్లిదండ్రుల ఆధార్ కార్డ్ / ఓటరు కార్డు / రేషన్ కార్డు / భూమి హక్కుల పత్రిక /MGNERGS జాబ్ కార్డ్ / పాస్పోర్ట్ / డ్రైవింగ్ లైసెన్స్/ విద్యుత్ బిల్లు / రెంటల్ అగ్రిమెంట్ కాపీ.
- పిల్లల వయస్సు ధ్రువీకరణ పత్రం.
- అర్హత వయస్సు: IB/CBSE/ICSE పాఠశాలలో ప్రవేశం కొరకు 31.03.2025 నాటికి 5 సంవత్సరముల వయస్సు నిండి ఉండవలెను. స్టేట్ సిలబస్ పాఠశాలలలో ప్రవేశము కొరకు 01.06.2025 నాటికి 5 సంవత్సరముల వయస్సు నిండి ఉండవలెను.
2025-26 విద్యా సంవత్సరానికి గాను RTE చట్టం-2009లోని సెక్షన్ 12(1) (C) ప్రకారం ఒకటో తరగతిలో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ షెడ్యూల్
కార్యాచరణ | షెడ్యూల్ |
ప్రవేశాల కొరకు కార్యాచరణ జారీ చేయడం | 17.04.2025 |
IB/ICSE/CBSE/రాష్ట్ర సిలబస్ ను అనుసరించే అన్ని ప్రైవేట్ అన్-ఎయిడెడ్ పాఠశాలలు పోర్టల్ లో నమోదు చేసుకోవడం | 19.04.2025 నుండి 26.04.2025 |
విద్యార్థుల నమోదు కొరకు పోర్టల్ అందుబాటులో ఉంచడం | 28.04.2025 నుండి 15.05.2025 |
GSWS (గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ) డేటా ద్వారా విద్యార్థుల ప్రవేశానికి అర్హతను నిర్ణయించడం | 16.05.2025 నుండి 20.05.2025 |
మొదటి విడత లాటరీ ఫలితాల ప్రచురణ | 21.05.2025 నుండి 24.05.2025 |
పాఠశాలల వారీగా విద్యార్థుల ప్రవేశాల నిర్ధారణ | 02.06.2025 |
రెండో విడత లాటరీ ఫలితాల ప్రచురణ | 06.06.2025 |
పాఠశాలల వారీగా విద్యార్థుల ప్రవేశ నిర్ధారణ | 12.06.2025 |
25% సీట్లను కేటాయించే విధానం
- అనాథ పిల్లలు, హెచ్ఐవి బాధితుల పిల్లలు, దివ్యాంగులు -5%
- ఎస్సీలకు – 10%
- ఎస్టీలకు – 4%
- మరియు బలహీన వర్గాలకు (బీసీ, మైనార్టీ, ఓసీ) చెందిన పిల్లలకు 6% సీట్లు