WhatsApp Channel Join Now
Telegram Group Join Now

16th September WORLD OZONE DAY

16th September WORLD OZONE DAY

September 16- ప్రపంచ ఓజోన్ పరిరక్షణ దినోత్సవం: ఓజోన్ పొర క్షీణతకు కారణమవుతున్న పదార్థాలపై 1987లో మాంట్రియల్ ప్రోటోకాల్స్ పై చేసిన సంతకాల తేదిని స్మరించుకునేలా ఈ రోజును నిర్ణయించబడింది. (16th September WORLD OZONE DAY)

అంతర్జాతీయ ఓజోన్ రక్షణా దినం గురించి

ఓజోన్ పొర క్షీణతకు కారణమవుతున్న పదార్థాలపై 1987లో మాంట్రియల్ ప్రోటోకాల్స్ పై చేసిన సంతకాల తేదిని స్మరించుకునేలా 16 సెప్టెంబర్ రోజును UN జనరల్ అసెంబ్లీ 1994లో అంతర్జాతీయ ఓజోన్ పొర సంరక్షణా దినం ప్రకటించింది. దశలవారీగా మాంట్రియల్ ప్రోటోకాల్ ప్రకారం తీసుకున్న చర్యల వల్ల, ఓజోన్ క్షీణతా పదార్థాల వాడకం తగ్గడం తద్వారా ఓజోన్ పొరను కాపాడటంలోనూ మరియు వాతావరణ మార్పు పరిష్కరించడ oలోనూ సహాయపడింది. ఓజోన్ క్షీణతకు దోహదపడుతున్న పదార్థాలుగా పరిగణించబడే వాయువులలో ముఖ్యంగా కార్బన్ టెట్రా క్లోరైడ్, క్లోరో-ఫ్లోరో కార్బన్స్,హాలోన్లు ఉన్నాయి.

ఓజోన్ పొర గురించి

ఓజోన్ పొర, సూర్యుని హానికరమైన కిరణాల నుండి భూమిని రక్షించడానికి వాయుకవచంలా ఉండి రక్షిస్తుంది. ఈ పొర భుగ్రహం మీద జీవరాసిని రక్షించడంలో సహాయపడుతుంది. హానికరమైన అతినీలలోహిత వికిరణం(harmful ultraviolet radiation) ను భూమికి చేరకుండా పరిమితం చేయడం ద్వారా మానవ ఆరోగ్యం మరియు పర్యావరణ వ్యవస్థలు రక్షిస్తుంది.

ఓజోన్ పొరను, ఫ్రెంచ్ భౌతికశాస్త్రవేత్తలు చార్లెస్ ఫాబ్రి మరియు హెన్రి బుసన్ 1913లో గుర్తించగా, భూమి ఉపరితలం నుండే స్ట్రాటోఆవరణ ఓజోన్ కొలవటానికి ఉపయోగిoచే స్పెక్ట్రోఫోటో మీటర్ ను కనుగొని బ్రిటిష్ శాస్త్రజ్ఞుడు డి.ఎం.బి. డాబ్సన్ దాని ద్వారా ఓజోన్ యొక్క పూర్తి వివరాలు అన్వేషించాడు.

1928 మరియు 1958 మధ్య డాబ్సన్ ప్రపంచవ్యాప్తంగా ఓజోన్ పర్యవేక్షణ స్టేషన్లను ఏర్పాటు చేశారు. అవి ఈ రోజుకి కూడా పనిచేస్తున్నాయి.  ఓజోన్ భారాన్ని కొలిచే కొలతకు డాబ్సన్ యూనిట్ అని పేరును పట్టడం ద్వారా అతనిని గౌరవించారు.

ఆమ్లజని (ఆక్సీజన్‌) మరో రూపమే ఓజోన్‌. ఇదివిషవాయువు. ప్రతీ ఓజోన్‌ అణువులోనుమూడు ఆమ్లజని పరమాణువులున్నాయి. దీని రసాయన సాంకేతికం O3 అతినీల లోహిత వికిరణాల కారణంగా వాతావరణం పై పొరలో ఆక్సీజన్‌ అణువులు (O2) విడిపోతాయి.స్వేచ్చగా ఉన్న ఆక్సీజన్‌ పరమాణువు (O), తాడితంతో ఆక్సీజన్‌ అణువులోకి చేరి (O3) ఆక్సీజన్‌ పరమాణువులుగా మారి ఓజోన్‌ అణువవుతుంది.

ఓజోన్‌ లాభ నష్టాలు

వాతావరణపు గాలి పొరలో (భూ ఉపరితలానికి సుమారుగా 15 – 50 కిలోమీటర్ల వరకు ఉంటుంది) ఓజోన్‌ సహజంగా ఉంటుంది. సూర్యుని నుండి వచ్చే అతి నీల లోహిత కిరణాలను భూమి పైకి రాకుండా అడ్డుకొని జీవరాశిని రక్షిస్తుంది. వాహనాల కాలుష్యం నైట్రోజన్‌ ఆక్సైడ్‌ల హైడ్రో కార్బన్‌ల స్థాయిలు పెరగడం వల్ల వాతావరణపు పైపొర భూఉపరితలానికి దగ్గర అయింది. సూర్యరశ్మిలో ఈ రసాయనాలు ఓజోన్‌గా మారతాయి. దగ్గు, గొంతు నొప్పి, ఉబ్బసవ్యాధిని పెంచడం శ్వాస కోశ వ్యాధులు మొదలగు సమస్యలను ఈ ఓజోన్‌ కల్గిస్తుంది. పంటలను కూడ నాశనం చేస్తుంది. వాతావరణపు గాలి పొరలో గల ఓజోన్‌ భూమిపై నున్న జీవరాశిని సూర్యుని నుండి వచ్చే అతినీలలో హిత కిరణాల నుండి రక్షిస్తుంది. వాతావరణానికి దిగువున ఉన్న ఓజోన్‌ ఆరోగ్య సమస్యలను కల్గిస్తుంది.

ఓజోన్‌ తరిగిపోవడమంటే ఏమిటి?క్లోరో ప్లూరో కార్బన్‌లు (CFCs) ఓజోన్‌ తరుగుదలకు ప్రాథమికరసాయనాలు .రిఫ్రిజరేటర్లలో ఎయిర్‌ కండీషన్‌ మొదలగు వాటిలో రిఫ్రిజెంట్లుగా ఉంటాయి.ఇవి క్లోరీన్‌ను కల్గి ఉంటాయి.రెండవ దశః సూర్యుని నుండి వచ్చే అతి నీల లోహిత కిరణాలు సి.ఎఫ్‌.సిని విచ్చిన్నం చేసి క్లోరీన్‌ని విడుదల చేస్తాయి.మూడవ దశః ఈ క్లోరీన్‌ పరమాణువులు ఓజోన్‌ అణువును విచ్చిన్నం చేసి ఓజోన్‌ తరిగి పోయేటట్లు చేస్తాయి.

ఓజోన్‌ తరిగి పోవడం వల్ల మన పై ప్రభావం ఎలా ఉంటుంది ?

ఓజోన్‌ పొర తరిగి పోవడం వల్ల అతి నీల లోహిత కిరణాలు భూమిని తాకడం అధికం అవుతుంది. దీని వల్ల జన్యువులు, కళ్ళు దెబ్బ తినడంతో పాటు సముద్ర జీవరాశి పై దుష్ప్రభావాన్ని చూపిస్తుంది.

Ozone day slogans in Telugu:
  1. ఓజోన్ కాపాడు, భూమిని రక్షించు!
  2. ఓజోన్ ఉంటే, జీవనం ఉంటుంది!
  3. ఓజోన్ కవచం, మన రక్షణం!
  4. ఓజోన్ సంరక్షణ, మన బాధ్యత!
  5. ఓజోన్ నీడలో, భవిష్యత్తు సురక్షితం!
  6. ఓజోన్ కాపాడండి, పర్యావరణం పరిరక్షించండి!
  7. ఓజోన్ రక్షణ, మన జాతి గర్వం!
  8. ఓజోన్ ఉంది, జీవం ఉంది!
  9. ఓజోన్ కాపాడితే, భవిష్యత్తు బాగుంటుంది!
  10. ఓజోన్ రక్షణ, మన ఆరోగ్య భరోసా!
  11. ఓజోన్ కవచాన్ని కాపాడు, ప్రకృతిని కాపాడు!
  12. ఓజోన్ మన స్నేహితుడు, దాన్ని సంరక్షించు!
  13. ఓజోన్ తోడైతే, జీవనం ఆనందమైతే!
  14. ఓజోన్ కోసం ఒక్క అడుగు, భూమి కోసం వంద అడుగులు!
  15. ఓజోన్ ఉంటే, సూర్యరశ్మి సురక్షితం!
  16. ఓజోన్ పరిరక్షణ, మనందరి లక్ష్యం
Ozone day slogans in English:
  1. Save Ozone, Save Earth
  2. Ozone is Our Shield
  3. Keep Ozone, Keep Life
  4. Protect Ozone, Protect Future
  5. Ozone Layer, Life Saver
  6. No Ozone, No Life
  7. Heal Ozone, Heal Earth
  8. Ozone Saves, So Save Ozone
  9. Act Now, Save Ozone
  10. Ozone Safety = Our Safety
  11. Don’t Let Ozone Fade
  12. Save Nature, Save Ozone
  13. Protect Ozone, Protect Yourself
  14. Be Cool, Save Ozone
  15. Keep the Sun Safe
  16. One Earth, One Ozone
  17. Ozone Protection is Must
  18. No Ozone, No Blue Sky
  19. Save Ozone, Save Tomorrow
  20. Strong Ozone, Strong Future
OZONE DAY Placards pdf DOWNLOAD
Thank you for reading... Share this...
Trending Information
error: Content is protected !!